తమిళ హీరోయిన్ మిర్నా మీనన్ ‘డాన్ బాస్కో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. రుష్య హీరోగా పి.శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మిర్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మూవీ స్కూల్ ఫ్రెండ్స్ రీయూనియన్ నేపథ్యంలో సాగుతుందని తెలిపింది. భావోద్వేగానికి గురిచేసే సన్నివేశాలు ఎన్నో ఉన్నట్లు చెప్పుకొచ్చింది.