ATP: రాయదుర్గం మండల పరిధిలోని కొంతానపల్లి గ్రామ సమీపాన గొంతు కోసి ఓ యువకుడిని చంపిన ఘటన కలకలం రేంపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు బోయ వినోద్ కుమార్ అనే యువకుడిని గొంతు కోసి చంపి పడేశారన్నారు. అర్బన్ సీఐ జయనాయక్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.