దర్శకుడు సాయి రాజేశ్ ‘బేబీ’ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోగా బాబిల్ ఖాన్ ఎంపికైనట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమా నుంచి తాను తప్పుకున్నట్లు బాబిల్ ఖాన్ ప్రకటించాడు. దీనిపై సాయి రాజేశ్ స్పందించాడు. తాను కలిసిన ప్రతిభావంతులైన, బాగా కష్టపడే నటుల్లో బాబిల్ ఖాన్ ఒకరని తెలిపాడు. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు పేర్కొన్నాడు.