రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసు ప్రారంభమైంది. అంతకు ముందు ఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్ చేరుకుంది. ఇక ఢిల్లీ నుంచి తొలి విమాన సర్వీస్‌లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు పురందేశ్వరి, ఉదయ్ శ్రీనివాస్ రాజమండ్రికి చేరుకున్నారు. వాటర్ కెనాల్స్‌తో ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జ్ఞానేశ్వరరావు స్వాగతం పలికారు.