దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో NIA సోదాలు చేపట్టింది. ఏకకాలంలో దేశంలోని 19 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. జమ్మూకశ్మీర్, అసోం, మహారాష్ట్ర, యూపీ, గుజరాత్లో తనిఖీలు చేస్తోంది. జైషే మహమ్మద్‌తో సంబంధాలు, ఉగ్రవాద ప్రచార వ్యాప్తి వంటి అంశాలపై సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.