నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన నయనతార డాక్యుమెంటరీ విషయంలో నటి నయనతార, ధనుష్ మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో ధనుష్ తీరుపై తాను రిలీజ్ చేసిన బహిరంగ లేఖపై నయనతార క్లారిటీ ఇచ్చింది. ‘న్యాయమని నమ్మిన దాన్ని బయటపెట్టడానికి నేను ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. నానుమ్ రౌడీ ధాన్ వీడియో క్లిప్స్‌కు సంబంధించిన NOC కోసం ధనుష్‌ను కలవడానికి ఎంతో ప్రయత్నించాం. కానీ అది జరగలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.