ATP: తాడిపత్రిలో బుగ్గ రామలింగేశ్వర స్వామికి అర్చకులు పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయం అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. బుగ్గ రామలింగేశ్వర స్వామి నిజరూపంలో దర్శనం ఇవ్వగా భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.