NRML: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకంలో అబద్ధపు ఆరోపణలు చేస్తూ కొంతమంది అసత్య రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చైర్మన్ గోవింద్ నాయక్ అన్నారు. గురువారం ప్రకటనలో వారు మాట్లాడుతూ.. కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ లబ్ధి పొంది రుణమాఫీ చేయడం లేదంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వాటిని మానుకోవాలని హితవు పలికారు.