HYD: సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉన్న చికెన్, మటన్ దుకాణాలపై అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేపట్టారు. షాపులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంట్లో భాగంగా నిబంధనలు పాటించని షాపులకు జరిమానాలు విధించారు. జీహెచ్ఎంసీ యాక్టివ్ 1995 ప్రకారం చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎవరైనా సరే నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.