AP: తిరుపతి జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపిలేని వర్షాల కారణంగా తిరుపతి వీధులన్నీ జలమయమయ్యాయి. వానల వల్ల తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో టీటీడీ అప్రమత్తమైంది. పాపవినాశనం, శ్రీవారి పాదాల వద్దకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేసింది. గోగర్భం, పాపవినాశనం జలశయాల నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది.