మహారాష్ట్రలో మహాయుతి కూటమి కొలువుదీరింది. కానీ కీలకమైన మంత్రి పదవుల పంపకాలపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ, అజిత్ పవార్-ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే శివసేన మధ్య ఇఫ్పటికే కీలకమైన శాఖలపై క్లారిటీ వచ్చింది. మిగిలిన శాఖలపై తేల్చుకునేందుకు సీఎం, డిప్యూటీ సీఎం అజిత్ ఢిల్లీకి వెళ్లారు. అమిత్ షా, నడ్డాలతో సమావేశం కానున్నారు. కాగా షిండే కూడా సెపరేటుగా వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.