గురుగ్రామ్‌లో ఓ బార్ బయట తామే బాంబు పేలుళ్లు జరిపామని.. లారెన్స్ బిష్ణోయ్ అనుచరులు రోహిత్ గడర, గోల్డీ బ్రార్ సోషల్ మీడియాలో తెలిపారు. బార్ ఓనర్ అక్రమ మార్గాల్లో కోట్లాది రూపాయలు సంపాదించడంతో పాటు పన్నులు ఎగ్గొట్టి దేశానికి నష్టం చేస్తున్నాడని ఆరోపించారు. అందరూ పన్నులు చెల్లించాలంటూ హెచ్చరించారు. ఇది చిన్న పేలుడు అని తేలిగ్గా తీసుకోవద్దని, భారీ పేలుళ్లు జరిపే సామర్థ్యం తమకు ఉందంటూ పోస్టు పెట్టారు.