TG: రాష్ట్ర కేబినెట్లో చోటుకోసం నేతలు మంతనాలు జరుపుతున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టారు. ఎమ్మెల్యేలు మదన్మోహన్ రావు, మల్రెడ్డి కేబినెట్లో తమకు అవకాశం కల్పించాలని ఇప్పటికే అధిష్టానం పెద్దలకు లేఖలు రాశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. మరోవైపు మైనారిటీ కోటా నుంచి ఫిరోజ్‌ఖాన్ యత్నిస్తున్నారు.