HYD: యువతితో సహజీవనం చేసి ఆమె నుంచి రూ. లక్షల్లో తీసుకొని ఉడాయించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధురా నగర్ PS పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వైజాగ్‌కు చెందిన యువతి HYDలో బ్యూటీషియన్‌గా పని చేస్తూ స్థిరపడింది. ఆమెకు ఓ క్యాబ్ డ్రైవర్ పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో సహజీవనం చేశాడు. పెళ్లి ప్రస్తావన రాగానే ఇద్దరి మతాలు వేరు అంటూ ముఖం చాటేశాడు. దీంతో ఆ యువతి పోలీసులు ఫిర్యాదు చేసింది.