అన్నమయ్య: మదనపల్లె నియోజక వర్గం ఖాజీగా షేక్ మొహమ్మద్ జలాలుద్దీన్ నియమితులు అయ్యారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ రెడ్డీ సాహెబ్, డా. ఎస్కే బాషా మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖాజీ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రభుత్వ పెద్దలకు.. ముస్లిం మైనారిటీ సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.