TG: రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర శివరాత్రి సందర్భంగా శివ భక్తులు ఉపవాస దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం హిందూ సంప్రదాయంలో ప్రత్యేకతను సంతరించుకుందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు గరళకంఠుని దీవెనలుండాలని ప్రార్థన చేశారు. దేశవ్యాప్తంగా శివాలయాలు, భక్తుల శివనామస్మరణతో మారుమోగుతున్నాయని తెలిపారు.