ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు దక్షిణాఫ్రికా, యూఎస్, కెనడా దేశాల్లో పౌరసత్వం ఉంది. అయితే తమ దేశ సార్వభౌమత్వానికి మస్క్ భంగం కలిగిస్తున్నారని, ఆయన పౌరసత్వాన్ని తొలగించాలంటూ కెనడాలో పిటిషన్ దాఖలైంది. అపార సంపద, శక్తితో కెనడా ఎన్నికలను మస్క్ ప్రభావితం చేయాలని చూస్తున్నారని కెనడా ఆరోపించింది.