TPT: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు.