మన్యం: జిల్లాలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికకు సర్వం సిద్ధమైనట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. 27వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం ఉదయం జరిగింది. తొలుత పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, జేసీ, పరిశీలించారు.