AP: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన వారికి నంద్యాల జిల్లా బనగానపల్లి జూనియర్ సివిల్ జడ్జి సరికొత్త శిక్ష విధించింది. మద్యం అనర్థాలు, రహదారి నిబంధనలపై ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో నిల్చోవాలని తీర్పునిచ్చింది. వారిలో పరివర్తన కోసం న్యాయమూర్తి షేక్ అబ్దుల్ రెహ్మాన్ ఈ ఉత్తర్వులిచ్చారు.