KKD: ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు హాజరు కాని 8మంది ఓపివోలు విధుల నుండి సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ షణ్మోహన్ సగిలి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ పోలింగ్ రోజున విధులు నిర్వహించడానికి నియమించిన సిబ్బందిలో గైర్హాజరైన కాకినాడ డివిజన్లో ముగ్గురు, పెద్దాపురం డివిజన్లో ఐదుగురు ఓపీఓలను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు