TG: ప్రస్తుతం SLBC టన్నెల్ వద్ద 11 సంస్థలు పనిచేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా SLBCని పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు రూ.5 వేల కోట్లలోపే పూర్తవుతుందన్నారు. ఇది పూర్తయితే 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని పేర్కొన్నారు.