కోనసీమ: రాష్ట్ర టైలర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ పరిరక్షణ కమిటీ ఉపాధ్యక్షుడిగా రాజోలుకు చెందిన స్టైలో టైలర్ కడలి వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పోగుల మల్లికార్జునరావు నుంచి ఉత్తర్వులు వచ్చాయని బుధవారం రమణ ఒక ప్రకటనలో తెలియజేశారు. రమణ నియామకంపై రాజోలు పట్టణ టైలర్స్ సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.