కృష్ణా: గన్నవరంకు చెందిన దాసరి మాన్య రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికైనట్లు ఫెన్సింగ్ శిక్షకుడు ధనియాల నాగరాజు తెలిపారు. గన్నవరంలో ఆయన బుధవారం మాట్లాడుతూ.. రాజమండ్రిలో జరిగిన జాతీయ స్థాయి అండర్ 14 ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని మాన్య ప్రతిభ కనబరిచినట్లు చెప్పారు. బాలల ఛాంపియన్షిప్ పోటీలలో జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు.