E.G: మహాశివరాత్రి సందర్భంగా రాజమండ్రిలోని గోదావరి పుష్కర ఘాట్లలో బుధవారం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పవిత్ర స్నానమాచరించారు. ఈ సందర్భంగా పలు శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వేడుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.