AP: ఆరు నెలల ప్రభుత్వ పాలనపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజాప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సుపరిపాలనతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్ అనే నినాదంతో ప్రతిపక్షం ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నాం. స్వర్ణాంధ్ర-2047 విజన్‌తో రాష్ట్రాన్ని నెం.1గా నిలబెడతాం’ అని పేర్కొన్నారు.