ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ జరిగింది. నారాయణ్‌పూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో భాగంగా ఇవాళ అబుజ్హామాద్లోని ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడ పట్టాయి. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కాల్పులు మొదలైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.