ముఖం మెరిసిపోవాలంటే బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఫేస్ క్లీన్, ఫేషియల్ వంటివి చేయించుకుంటారు. కానీ బొప్పాయి ఫేస్ ప్యాక్‌తో ముఖ ఛాయను పెంచుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి గుజ్జు, కలబంద, తేనె కలిపి మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్ లాగా వేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై మచ్చలు, ట్యాన్ తగ్గిపోతాయి. చర్మం ప్రకాశవంతంగా, బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. వారానికి 2సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.