ELR: జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొని ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు. ప్రజల సంక్షేమమే నాకు ప్రథమ కర్తవ్యం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.