ASF: వర్షాకాలం రోడ్డుపై వచ్చే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని కౌటాల ఎస్సై విజయ్ సూచించారు. రోడ్డు ఖాళీ ఉంది కదా అని.. మితిమీరిన వేగంతో వెళ్లడం అంత మంచిది కాదని పరిమిత వేగంతోనే వెళ్లాలన్నారు. నీరు నిలిచి ఉన్న ప్రాంతంలో నిదానం పాటించడమే మంచిదని పేర్కొన్నారు. రోడ్డుపై వాహనాలతో వర్షాకాలం స్టంట్లు చేయడం ప్రాణానికి ప్రమాదమని హెచ్చరించారు.