TG: రంగారెడ్డి జిల్లాలోని చెవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ దగ్గర లారీ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నానని.. ప్రమాదంలో మృతి చెందిన వారి కటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.