APలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఇవాళ అనేక జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కంకిపాడులో అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నందివాడలో 46, తొర్రగుడిపాడు, అల్లిపల్లిలో 45.9, పిడుగురాళ్లలో 45.7, వేటపాలెంలో 45.6, నందమూరులో 44.7, కూచిపూడిలో 44.6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో తీవ్ర వడగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.