AP: వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసిందంటూ గతంలో జేపీ వెంచర్స్‌పై NGT రూ.18 కోట్ల జరిమానా విధించింది. ఈ నగదును 2 వారాల్లో డిపాజిట్ చేయాలని సుప్రీం ఆదేశించింది. NGT జరిమానాపై గతంలో విధించిన స్టేను ఎత్తివేసింది. నాగేంద్రకుమార్ దాఖలు చేసిన అఫిడవిట్‌ను సుప్రీం పరిగణనలోకి తీసుకుంది.