ప్రకాశం: పెద్ద దోర్నాల మండలంలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఒక ఎరువుల దుకాణంలో రూ. 10 లక్షల విలువైన 35 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాలను విజిలెన్స్ సీఐ అపర్ణ నిలిపివేశారు. స్టాక్ ను సరిగా చూపించనందున ఈ చర్యలు తీసుకున్నట్లు సీఐ తెలిపారు.