ఏటా అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం, మానసిక రుగ్మతలను నయం చేయడంలో ప్రోత్సాహం ఇవ్వడమే దీని ఉద్దేశం. శారీరకంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని ఈ రోజు గుర్తు చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని, ఇతరుల సమస్యలను అర్థం చేసుకుని సహాయం చేయాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.