AP: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాల కేంద్రాల్లో తనిఖీలకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. కల్తీ పాల ఘటనలో ఏడుగురు పరిస్థితి ఆందోళకరంగా ఉన్నట్లు సమాచారం. బాధితుల నివాస ప్రాంతాల్లో పర్యవేక్షిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 24 గంటలు అందుబాటులో ఉండేలా వైద్యులను నియమించనుంది. మరో ఐదు రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయని తెలిపింది.