AP: వైసీపీకి, ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదని షర్మిల వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాబల్యం పెరగడానికి కారణం టీడీపీ కారణమని చెప్పడం వారి వెర్రితనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పుంజుకుంటుంటే చూసి ఓర్వలేక నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా నీచపు చేష్టలు మారలేదని అన్నారు.