బీహార్లో NDA విజయంపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. రాహుల్ గాంధీని బీజేపీకి ‘అదృష్ట చిహ్నం’గా అభివర్ణించారు. రాహుల్ ‘ఓటు చోరి’ ప్రచారం మొదలుపెట్టడంతోనే ప్రజలు మోదీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు. ‘ఇది మోదీ, నితీష్ ప్రజానుకూల విధానాల విజయం. మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ పూర్తిగా అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నా’ అని తెలిపారు.