మహిళలకు పలు దశల్లో హార్మోన్ల అసమతుల్యత, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే ఆహారంలో మనం చేర్చుకునే కొన్ని పదార్థాల వల్ల ఈ సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే పాలకూర, ఆపిల్, బొప్పాయి, దోస, జీలకర్ర, అల్లం వంటివి జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి. మెనోపాజ్ దశలో వచ్చే మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. రక్తహీనత దరిచేరదు.