శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. జలుబు చేసినప్పుడు ముక్కు బ్లాక్ అయిపోయి శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కర్పూరంలో కాస్త కొబ్బరినూనె కలిపి వాసన చూడాలి. ఆరోమా ఆయిల్స్ లేదా విక్స్ బామ్ వేడినీటిలో వేసి ఆవిరి పట్టాలి. యూకలిప్టస్ ఆయిల్ కూడా ముక్కుదిబ్బడ సమస్యను తగ్గిస్తుంది. చిన్నపాటి శ్వాస సంబంధిత వ్యాయామాలు రిలీఫ్ కలిగిస్తాయి.