AP: అమరావతి పేరు పలకడానికే జగన్ ఇష్టపడట్లేదని, అందుకే ‘మావిగన్’ అనే వింతపేరును తీసుకొచ్చారంటూ CM చంద్రబాబు ధ్వజమెత్తారు. NDA నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ‘మా రాజధాని అమరావతి అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలి. చట్టబద్ధత బిల్లుకు ఆమోదంపై సాయంత్రం గ్రామగ్రామాల్లో పండుగలా కార్యక్రమాలు జరపాలి. మధ్యాహ్నం ఉద్ధండరాయునిపాలెం సంబరాల్లో నేనూ పాల్గొంటా’ అని తెలిపారు.