AP: మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం ఆయన ఏవోబీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. పీపుల్స్ వార్లో పలు హోదాల్లో పనిచేశారు. ఇవాళ ఆయన లొంగుబాటును డీజీపీ అధికారికంగా ధృవీకరించనున్నారు. నారాయణరావు లొంగుబాటు ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.