TG: BRS సిల్వర్ జూబ్లీ వేడుకలపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ సభను నిర్వహించనుంది. సభ కోసం 3 వేల బస్సులు అద్దెకు కావాలని RTC ఎండీ సజ్జనార్‌ను BRS పార్టీ నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. అద్దె కోసం అవసరమైన రూ.8 కోట్ల చెక్కును సజ్జనార్‌కు అందజేశారు. అయితే, ఈ సభ నేపథ్యంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.