‘హష్ మనీ’ కేసులో అమెరికా తదుపరి అధ్యక్షుడు ట్రంప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్‌స్టార్‌కు హష్ మనీ చెల్లించిన కేసులో తనకు ఉపశమనం కల్పించాలని కోర్టును ట్రంప్ అభ్యర్థించారు. ఆయన విజ్ఞప్తిని న్యూయార్క్ జడ్జి తోసిపుచ్చారు. అధ్యక్షులకు రక్షణ అధికారిక చర్యలకు మాత్రమే ఉంటుందని న్యాయమూర్తి జువాన్ మర్చన్ పేర్కొన్నారు. అనధికార ప్రవర్తనకు అలాంటి రక్షణ వర్తించదని వ్యాఖ్యానించారు.