పంజాబ్: అమృత్సర్లోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఇవాళ ఉదయం పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. PSలో ఎలాంటి పేలుడు, ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇది తమ పనేనని జర్మనీకి చెందిన గ్యాంగ్స్టర్ జీవన్ ఫౌజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో 10మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు.