KDP: కేసి కాలువ ఒకప్పుడు అనాధలకు స్నాన వాటికగా ఉపయోగపడేది. నేడు అదే కేసి కాలువ డంపింగ్ యార్డును తలపిస్తుంది. కడపలోని బిల్డప్ సర్కిల్ నుంచి వినాయక సర్కిల్ మధ్య ఉన్న కేసీ కాలువలో ప్లాస్టిక్ వ్యర్ధాలు పేరుకుపోయాయి. దీంతో దుర్గంధం వెదజల్లుతుందని ప్రజలు మండిపడుతున్నారు. నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని అభిప్రాయపడుతున్నారు.