W.G: స్వగ్రామంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి తనవంతు వైద్య సేవలను అందిస్తున్నానని భీమవరం మండలం తుందుర్రుకి చెందిన డా.మురళి ఆరేటి వెల్లడించారు. హైస్కూల్ ప్రాంగణంలో భీమవరం మిత్ర మెడికేర్ హాస్పిటల్ ఉచిత మెగా క్యాంప్‌ను నిర్వహించింది. డాక్టర్లు ప్రతి ఒక్కరికి షుగర్, బీపీ, అవసరమైన వారికి ఈసీజీ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.