TG: కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇటీవల భారీ వర్షాలకు జరిగిన నష్టంపై సీఎం సమీక్ష చేపట్టారు. ఇందులో మంత్రులు సీతక్క, పొంగులేటి, పీసీసీ అధ్యక్షుడు పాల్గొన్నారు. కాగా కొద్దిసేపటి ముందు సీఎం రేవంత్ కామారెడ్డిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.