AP: శ్రీరామనవమి సందర్భంగా DY CM పవన్ భద్రాచలం వెళ్లాల్సి ఉంది. అయితే TG CM రేవంత్ భద్రాచలం పర్యటనకు వెళ్లనుండటంతో పవన్ పర్యటనను రద్దు చేసుకోమని అధికారులు కోరారట. శ్రీరామనవమి వేళ భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని.. ఈ సమయంలో పవన్ వస్తే భద్రతా ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు తెలిపారని సమాచారం. దీంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.