ప్రకాశం: టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలోని సోమవారం అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సింగరాయకొండ సీఐ హజరత్ అయ్యా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వారి వద్ద నుండి 41 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నలుగురు నిందితులను రిమాండ్కు తరలిస్తునట్లు తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు.